Actions

Work Header

Rating:
Archive Warning:
Fandom:
Characters:
Additional Tags:
Language:
తెలుగు
Stats:
Published:
2026-08-10
Updated:
2026-08-10
Words:
617
Chapters:
1/?
Comments:
2
Hits:
10

సముద్రంలోకి దూకడం

Summary:

కిప్ కి చెన్నై కి కల పరిశోధన కార్యకలాపం కోసం వెళ్తే స్కాట్ కూడా వస్తాడు.

Chapter 1: చెన్నై లోకల్

Chapter Text

“ఇక్కడ దిగి కొంచం నడిచి చూద్దాము” అని కిప్ అన్నాడు. హోటల్ అడ్రస్ ఫోన్ లో పెట్టుకొని ఆ దిశ ప్రకారం నడిచారు. తెల్లవారి జామున మూడింటికి లేచి, ఢిల్లీ నించి 6:15 ఫ్లైట్ పట్టుకొని చెన్నై మెట్రో కళైమాగల్ స్టేషన్ కి వచ్చారు. ఇలా లోకల్ వాళ్ళ లాగా తిరగడం అనేది స్కాట్ ఆలోచన. కొత్త వూరు, కొత్త దేశం, కొత్త పరిసరాలలో అన్వేషించడం అనేది అతనికి సరదా.

నిజం చెప్పాలంటే కిప్ కి గూడా అలగే చెయ్యాలని ఉంది కానీ స్కాట్ దానిని నిర్వహించగలడో లేదో అనేది అతనికి తెలియదు. న్యూ యార్క్ లో అతని ఫ్లాట్ ఒక మహాభవనం లాగా ఉండేది … అయినా సరే, వాళ్లిదరు కలిసినప్పుడు ఒకే కంచం ఒకే మంచం అన్నట్టు అతుక్కుని పొయ్యేవారు. హాల్లో మూడు సోఫాలు ఉన్న గూడా, ఇద్దరు ఒకే మూలాన కూర్చుని సరదాగా గడిపేవారు.

హోటల్ బోర్డు కనిపించింది. లోపలి వెళ్ల్లీ, పెరులు చెప్పి నమోదు చేయించుకొని, రూమ్ తాళ్లలు తీసుకొన్నారు. రూమ్ కి వెళ్లి, సామాను లోపల పెట్టి ఇద్దరు చేరో మంచం మీద అడ్డం పడ్డారు. ఇద్దరికీ ఒకటే ఆలోచన …అది కళ్ళ ద్వారా వ్యక్తపరిచారు.

ఈ హోటల్ ఒక హాస్టల్ యువ యాత్రికుల కోసం. వాళ్ళ రూమ్ లో నాలుగు మంచాల పైన ఇంకో నాలుగు మంచాలు. బంక్ బెడ్స్. మొత్తం ఎనిమిది మంది ఉంటారు కానీ మిగితా వాళ్ళింకెవరు రాలేదు.
తలుపు గంట మోగింది.

“యెస్ ?” అని కిప్ అన్నాడు.
ఒక్క అబ్బాయి వచ్చి ఇద్దరికీ చెరొక చల్లటి కొబ్బరి బోండా తెచ్చికాదు.

“ఫ్రెష్ సార్” అని ఇద్దరికి చేరొక్క సబ్బు ప్యాకెట్, తువాలు, హవాయి చప్పల్ ఇచ్చాడు

“అతను కొబ్బరి నీళ్లు ఫ్రెష్ అని చెప్పాడా? లేక మనని ఫ్రెష్ అవమని చెప్పాడా?” అని అడిగాడు స్కాట్.
కిప్ కొబ్బరి నీళ్లు అప్పుడే తాగేశాడు.

“ఏదైనా సరే! ఇది తాగిని తరువాత నాకు కొంచం ప్రాణం వచ్చింది!” అన్నాడు కిప్. “ఇప్పుడు తినాలా? నిద్దర పోవాలా? స్నానం చెయ్యాలా?”

“అన్ని!” నవ్వుతూ అన్నాడు స్కాట్. “తలుపు గడియ వేసి తొందరగా స్నానం చేసేద్దామా?”

“అబ్బో!”

అప్పటి దాక అలిసిపోయిన కిప్ ఉషారుగా లేచి గబగబా పెట్టి నించి బట్టలు తీస్కొని వాష్రూమ్ లో క్కి దూకేసాడు

“అరే! నా కోసం ఆగు!” అని స్కాట్ పిలుస్తూ తన వెంట వచేసాడు.

“తలుపు గడియ వేసావా?” అని కిప్ అడిగాడు.

“ఆ” అన్నాడు స్కాట్

“మెయిన్ డోర్?”

“మెయిన్ డోర్ కి లోపల నించి గడియ లేదు. కానీ ఏమి పరవాలేదు. మన జిం లో లాగానే …”

“సరే” కిప్ కి ఇంకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు హాయిగా ఒకలోకాళ్ళకి సుబ్బు రుద్దుకుంటూ స్నానం చేసారు.

“నువ్వు రిజిస్టర్ లో నీ పేరు క్రిస్ అని రాసావు?”

“అవును, నా పాస్పోర్ట్ మీద అదే ఉంది కదా, అదే సులభం”

“నేను కూడా ఇంకో పేరు వాడితే? ఉరికెనే?”

“ఏఁ పేరు?”

“సన్నీ ఎలా ఉంటుంది?”

“సన్నీ ఎందుకు? అపోలో అని పిలుచుకుంటాను. నువ్వొక గ్రీక్ గాడ్ లాగ ఉంటావు కదా” అని కిప్ అంటూ స్కాట్ ని - అంటే అపోలో ని - దగ్గర తీసుకున్నాడు.


అప్పుడప్పుడు వాష్రూమ్ లో లైట్, ఫ్యాన్ ఆఫ్ చేసి రూమ్ లోకి ఎవరైనా వచ్చారో లేదు చెక్ చేసారు. రూమ్ లో ఎవ్వరు లైట్ వెయ్యలేదు, ఏమి శబ్దం గూడా వినపడలేదు. అప్పుడు వాళ్ళు మళ్ళి వాష్రూమ్ లో లైట్, ఫ్యాన్ ఆన్ చేసి స్నానం పూర్తీ చేసి బట్టలు వేసుకున్నారు. ఒకళ్ళ తరువాత ఒకళ్ళు బైటికి వచ్చారు కానీ ఏమి పరవాలేదు. ఎవరు రాలేదు.
హోటల్ లో కెఫె ఉంటె అక్కడే టిఫిన్ చేసారు. టిఫిన్ అని పేరు కానీ అది లంచ్ లాగానే తిన్నారు. ఇడ్లి, దోస, పెసరట్టు, పెరుగన్నం అన్ని ఒకటి తరువాత ఒకటి లాగించేసారు.

“ఇంత కాళీ గ ఎందుకు ఉంది?” అని వెయిటర్ ని అడిగారు.

“ఇవాళ బీచ్ దగ్గర ప్రదర్శన జరుగుతోంది. ఇవల్లే మొదటి రోజు. ఆర్ట్, మ్యూజిక్, హ్యాండీక్రాఫ్ట్స్ అన్ని ఉంటాయి. పిల్లలకి గూడా ఏవేవో ఉంటాయి. సాయంత్రం పెద్ద కచేరి జరుగుతుంది. అప్పుడు ఇక్కడంతా ఫుల్లీ బూక్డ్ అయిపోతుంది”

“మొత్తం బీచ్ అంత ఉంటుందా ప్రదర్శన?”

“అరే, లేదు లేదు. బీచ్ చాలా పెద్దది. ఎంత మంది జనం ఉన్నా సముద్రం దగ్గర మనస్సు ప్రశాంతం గా ఉంటుంది.”

“సముద్రం దగ్గరికి ఇప్పుడే వెళ్దామా, లేకపోతె సాయంత్రం వెళ్దామా?” అడిగాడు కిప్.

“సాయంత్రం వెల్దాములే. ఇప్పుడు నాకు హాయిగా నిద్దర పోవాలని ఉంది!”

స్కాట్ కి తెలుసు, ఇప్పుడు నిద్దర పొతే అంత తొందరగా లేవరని. బహుశా రేపొద్దున దాక లేవకపోవచ్చు. కానీ పరవాలేదు. రేపొద్దున “యోగ ఆన్ దీ బీచ్” కి వెళ్లాలనుకొన్నారు. అక్కడ సూర్యోదయం కూడా చుస్కోవచ్చు . దాని గురించి స్కాట్ ముందరే కనుక్కున్నాడు. పొద్దునే 5 కిలోమీటర్లు పరిగెత్తడానికి చెన్నై లో ఏ రూట్ బాగుంటుందని ఇంటర్నెట్ లో వెతుకుతూ ఒక ట్రావెల్ ఫోరమ్ లో చెన్నై బీచ్ అని రికమండేషన్ చూసాడు. అక్కడ సూర్యోదయం యోగ క్లాసులు గూడా ఉంటాయని చదివాడు.

కిప్ చెన్నైకి కళ గురించి పరిశోధన కోసం వచ్చాడు. సోమవారం నించి ఫైన్ ఆర్ట్స్ కాలేజీ లో రెండు వరాల ట్రైనింగ్ కోర్స్ కి వెళ్తాడు. కానీ ఈ రెండు రోజులు కిప్ తో తిరగచ్చు.
టిఫిన్ చేసిన తరువాత రూమ్ కి వెళ్లి చెరో మంచం మీద పడుకొన్నారు. స్కాట్ ని ఏదో అడగాలనుకున్నాడు కానీ కళ్ళు మూ సుకుపోయినాయి. తెలియకుండగానే నిద్దరొచ్చేసింది.

స్కాట్ కిప్ ని చూసుకుంటూ ఆనందిన్చాడు. మనసు ప్రశాంతంగా ఉంది. కిప్ లేకపోతె ఆతను అసలు చెన్నై కి వచ్చేవాడా? అవకాశం తక్కువ. ఇద్దరు కలిసి ఉంటె ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళచ్చని ఆలోచిస్తూ నిద్దరలోకి పడిపోయాడు.